విద్యతోనే భవిష్యత్‌కు బాట.. లక్ష్యసాధనకు పట్టుదలే ఆయుధం!!!
•ప్రభుత్వ పాఠశాల నుంచి డాక్టర్‌గా ఎదిగా.. ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యేగా…
•అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే పట్టుదలే ముఖ్యం..విద్యార్థులకు డాక్టర్ తెల్లం వెంకట్రావు హితబోధ..
జులై 29 TODAY9..
విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సూచించారు. చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.
ఇది ఇలా ఉంటే తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని డాక్టర్‌గా ఎదిగానని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని విద్యార్థులకు వివరించారు. జీవితంలో ఎదగాలంటే లక్ష్యంపై గురి పెట్టాలని .. అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కష్టపడే తత్వం ఉండాలని హితవు పలికారు.
పాఠశాల భోజనశాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానమని, నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన ఎమ్మెల్యే.. పాఠశాలకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజ్ వర్మ, ఎస్సై నరసింహరెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు









