పేద కుటుంబానికి భరోసా.. వైద్య చికిత్సకు రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామం కాల్వ బజార్‌కు చెందిన చెట్టి రాంబాయ్ వైద్య చికిత్స నిమిత్తం రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ ని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సకు ఇబ్బంది పడే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.









