భద్రాచలం మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం…జులై 30… D వినేష్.. డివిజన్ ప్రతినిధి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై మండలంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారులు వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రజలకు అవసరమైన సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









