అశ్వాపురం మండలంలో వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అశ్వాపురం మండలంలో వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

గోదావరి వరదల ఉధృతి నేపథ్యంలో అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజారా, రామచంద్రాపురం గ్రామాల్లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వరద పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గ్రామాల్లోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వరద బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు