ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కాలి
బీఎస్పీ మండల అధ్యక్షులు బొడ్డు బాబురావు
ఆగష్టు 2:
తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కాలని నేలకొండపల్లి బీఎస్పీ మండల అధ్యక్షులు బొడ్డు బాబురావు కోరారు. 1969 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రజాసంఘాలు పనిచేశాయి. అవి ప్రజలను కూడగట్టి, ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టాయని .ఎన్నో త్యాగాలు చేశాయని గుర్తు చేశారు .కాగా ఈ పునాదులపై నిర్మాణమైన రాజకీయ పార్టీలు ఓట్లు దండుకుంటున్నాయి తప్ప ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు, లాభం దక్కలేదని ఆయన ఆవేదన వెళ్ళగక్కారు .
ఆనాటి రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇంతటి పాత్ర నిర్వహించిన ప్రజా సంఘాల చరిత్రను విస్మరించి దశాబ్దకాలం పాలించిన కేసీఆర్ గానీ, రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రేవంత్ రె డ్డి ప్రభుత్వం గానీ ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని వాపోయారు. ఇంకా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వారిని అవమానపరచటం శోచనీయమని అన్నారు.
ప్రతి సందర్భంలో పోరాడే శక్తులు కనుమరుగైనట్లే తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారులకు పార్లమెంటరీ పార్టీలు అన్యాయం చేశాయని . ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కూడా అవే పరిస్థితులు నికార్సయిన ఉద్యమకారులకు ఎదురవు తున్నాయన్నారు .
ఈ పరిణామాలతో తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర కనుమరుగు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు అప్రమత్తంగా ఉంటూ సమగ్ర తెలంగాణ చరిత్రను నిర్మాణం చేసే బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా బాబురావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముందు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ పలు న్యాయమైన డిమాండ్లను ఉంచుతున్నదన్నారు . తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, మూడు దశల తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేయాలని . ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో అమరత్వం పొందిన ఉద్యమ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని . వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాలని అన్నారు .
తెలంగాణ ప్రజాఫ్రంట్ మాజీ అధ్యక్షులు ఆకుల భూమయ్య హత్యకు కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని . ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు బలమైన ఊతం అందించిన వరంగల్ డిక్లరేషన్ సభలో ప్రవేశపెట్టిన అంశాలు అమ లయ్యేలా చూడాలని అన్నారు. ఉద్యమంలో అమరత్వం పొందిన వారి స్మారక స్థూపాలను ప్రభుత్వమే అధికారికంగా నెలకొల్పాలని,. తెలంగాణ పోరాటంలో విద్యార్థి, ఉద్యమ కారులపై నమోదైన ‘ఊపా’ తదితర కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
‘ఎన్ఐఏ’ తరహా దాడులను అరికట్టి రాజకీయ ఖైదీల విడుదలకు ప్రభుత్వం పూనుకోవాలని,తొలితరం ఉద్యమ శిఖరం, తెలంగాణకు దీపస్తంభం వంటి వరవరరావుని తెలంగాణకు తీసుకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో అమరవీరుల స్మారక స్థూపాలను నిర్మించి అధికారికంగా శ్రద్ధాంజలి ఘటించాలని . విభజనను వ్యతిరేకించిన వ్యక్తుల గుర్తులను తెలంగాణలో తొలగించాలని, తెలంగాణ భాషను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని . తెలంగాణ అస్తిత్వానికి భంగం వాటిల్లకుండా చూడాలంటూ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విన్నవించారు.









