గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం: ఆగస్ట్ 02 :
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ఎంపీ పోరిక బలరాం నాయక్ , ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, గ్రీన్ భద్రాద్రి సంస్థ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం సుమారు 500 మొక్కలను నాటి భద్రాచలాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సంస్థ సభ్యులను అభినందించారు. గ్రీన్ భద్రాద్రి అందిస్తున్న సేవలు భద్రాచలం పట్టణానికి వెలకట్టలేనివని కొనియాడారు.
అలాగే 2026–2027 సంవత్సరానికి గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులుగా రెడ్డి బత్తుల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భూక్య రంజిత్ నాయక్, కోశాధికారిగా ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో మరిన్ని మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్ది భద్రాచలాన్ని మరింత పచ్చని వాతావరణంతో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, యువ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









