ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభ కరపత్ర ఆవిష్కరణ
● ఆదివాసీ దినోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన- LHPS రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్.
ఆగస్టు 02: (TODAY 9)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) నంగారా బేరి ఆధ్వర్యంలో ఆగస్టు 9న కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ (గిరిజన) దినోత్సవ సభ కరపత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ఆవిష్కరించారు. గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవం – మన హక్కుల సాధనే మన లక్ష్యం అనే నినాదంతో ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు, బంజారాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆదివాసి సంఘం నాయకులు కొన్ని ప్రధాన డిమాండ్లను వెల్లడించారు.గోర్ బోలి (బంజారా భాష) ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని .ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన 7.5% నుండి 14%కి పెంచాలి. తెలంగాణ రాష్ట్రం కేటాయించిన ఎస్టీల 10% రిజర్వేషన్‌ను వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చాలని,దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలందరినీ ఒకే ఎస్టీ జాబితాలో చేర్చాలని . తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చడంతో పాటు ప్రత్యేకంగా తండా డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్టీలు సాగు చేస్తున్న లావాణి, సీలింగ్, పోడు భూములకు శాశ్వతంగా పూర్తి హక్కులతో కూడిన పట్టాలను అసెంబ్లీలో చట్టం చేసి అందించాలని అన్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారావు, సీనియర్ నాయకులు భీముడు నాయక్, వైరా ఇంచార్జ్ నాగేశ్వరావు, మండల అధ్యక్షులు లకావత్ రాజు,సభ్యులు లకావత్ సత్యనారాయణ, భూక్య రాము, బాణోత్ బాలాజీ, భూక్య బాలాజీ, లకావత్ రమేష్, లకావత్ చెన్నారావు,భూక్య అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.









