ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు రానున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని అధికారి వర్గాలు తెలిపాయి.
ప్రాంతాల వారీ వర్ష సూచనను పరిశీలిస్తే, ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం పరిధిలో ఆగస్టు 6వ తేదీ వరకు భారీ వర్షాలు నమోదు కావచ్చు. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆగస్టు 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆగస్టు 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున, గాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.









