నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు …*
భద్రాచలం : ఆగస్ట్ 05 : TODAY 9…
భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పూల బొకే ఇచ్చి ఆహ్వానం పలికారు శాలువాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సత్కరించారు..
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “భద్రాచలం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు . నూతన వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి” అని పేర్కొన్నారు.ఈ బ్రిడ్జి ఈ నెల లోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణదొర, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









