విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ & కళాశాల ప్రిన్సిపాల్

 

Toda9News ప్రతినిధి,
D రమేష్‌, మణుగూరు

సుమారు 1.5 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్పనాయకుడు.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో.. ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న … సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు కోలపిన్ని మానస, కళాశాల ప్రిన్సిపాల్ నల్లగట్ల సత్య ప్రకాష్ లు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 1.5 కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులు మరియు ఇతర సౌకర్యాలను కల్పించి, ఏజెన్సీలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల విద్యార్థులకు త్వరలో కాలేజీ యూనిఫామ్ ల తో పాటు ఉదయాన్నే అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయడం జరుగుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతశ్రేణి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు బాబురావు, సురేష్, కృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు