రాజమండ్రి నగరంలో పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతున్న 28 ఏళ్ల ప్రియాంక అనే విద్యార్థిని ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లింది. మాల్ పార్కింగ్ ప్రదేశంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు చిన్న వాగ్వాదం జరిగింది.
ఈ చిన్న గొడవతో కోపంతో ఊగిపోయిన ఆ యువకులు మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టారు. స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను అతివేగంగా కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఆ ప్రమాదంలో ఆమె కింద పడిపోగా, దుండగులు ఏమాత్రం కనికరం లేకుండా ఆమె తలపై నుంచి కారును పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటన అనంతరం స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులైన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.









