Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు.
మణుగూరు ప్రభుత్వ ఐటిఐ/ ఏ టి సి లో ఈనెల 6నుంచి 15వ తేదీ వరకు 2వ విడత ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ ఓ సారంగపాణి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని అన్ని ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ప్రవేశాలు కోరుతున్నట్లు తెలిపారు. మొదటి విడుత లో దరఖాస్తు చేసుకొని సిటు రానివారు మరోసారి ఆప్షన్స్ పెట్టుకోవాలన్నారు. గతంలో దరఖాస్తు చేయనివారు కొత్తగా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని పినపాక నియోజకవర్గం పరిధిలోని విద్యార్థిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన ట్రేడ్లలో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. అడ్మిషన్ల కోసం www.iti. telangana.gov.in లో ఈ నెల 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవసరం ఐన విద్యార్థులకు కాలేజి ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు.









