భద్రాచలంలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

భద్రాచలంలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు..

వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఐటీడీఏ పీవో రాహుల్, సర్పంచ్ పూనెం కృష్ణ..

ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్న ఆదివాసి సంఘం నాయకుడు ముర్ల రమేష్…

ఏజెన్సీ చట్టాలను పరిరక్షించాలంటూ కోరిన పలువురు ఆదివాసీ నాయకులు…

భద్రాచలం ఆగస్ట్ 09 : D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..

భద్రాచలంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు , ఐటిడిఏ పీఓ  రాహుల్ కలిసి అంబేద్కర్ సెంటర్, సినిమా సెంటర్, కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటిడిఏ రోడ్డులోని కొమరం భీమ్ గారి విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగురవేశారు.

అనంతరం భారీ ర్యాలీగా ఐటిడిఏ కార్యాలయం పక్కన ఉన్న గిరిజన భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదివాసీ కళాకారుల సాంప్రదాయ నృత్యాలు, కళారూపాలు, ముత్యాల ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. భారీ సంఖ్యలో ఆదివాసీ, గిరిజన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆదివాసీ, గిరిజన ప్రజలకు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు