కాకినాడ జిల్లా జగ్గంపేటలో రక్షిత మంచినీటి సరఫరాను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు పడింది. జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గోకవరం రోడ్డులో అన్నపూర్ణ పౌష్టికాంప్లెక్స్ కోళ్ల ఫారాల వద్ద నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంక్‌ను ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో జల జీవన్ మిషన్ నిధులతో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.633.94 లక్షలుగా ఉంది. గ్రామ ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు.
జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.









