జియో క్రెడిట్‌లోకి బ్యాంక్ ఆఫ్ అమెరికా.. రూ.18,268 కోట్ల భారీ పెట్టుబడి

ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్‌లో భారీ పెట్టుబడికి అమెరికా దిగ్గజ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. జియో క్రెడిట్‌లో 49.9 శాతం వరకు వాటాను సుమారు రూ.18,268 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ ఎన్‌బీ హోల్డింగ్స్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టనుంది.

మొదటి దశలో ప్రిఫరెన్షియల్ షేర్ కేటాయింపు ద్వారా రూ.6,613 కోట్ల పెట్టుబడితో 4.29 కోట్ల ఈక్విటీ షేర్లను ఎన్‌బీ హోల్డింగ్స్ కొనుగోలు చేయనుంది. దీంతో జియో క్రెడిట్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికాకు 26.50 శాతం వాటా లభిస్తుంది. అనంతరం రూ.11,655 కోట్ల విలువైన 7.56 కోట్ల వారెంట్లను ఎన్‌బీ హోల్డింగ్స్ సబ్‌స్క్రైబ్ చేయనుంది.

ఈ వారెంట్లను 18 నెలల్లోపు ఈక్విటీ షేర్లుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జియో క్రెడిట్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాటా 49.90 శాతానికి చేరుతుంది. ఈ భారీ పెట్టుబడి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన రుణ వ్యాపార విస్తరణకు, ఆర్థిక సేవల రంగంలో మరింత బలోపేతానికి కీలకంగా మారే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు