విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కిన మంత్రి సుభాష్.. రామచంద్రపురంలో తిరంగా ర్యాలీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామచంద్రపురం మండలంలో ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగన్నాయకులపాలెం గ్రామం నుంచి ద్రాక్షారామ గ్రామం వరకు జరిగిన ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ పాల్గొన్నారు.

జాతీయ జెండాలతో విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. మంత్రి సుభాష్ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని వారిని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు