Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోని కమలాపురం గ్రామం కి చెందిన పిల్లల పుల్లమ్మ,. అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు, ఆమెపరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది.తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. పిల్లల పుల్లమ్మ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం..
ఆమె దయనీయ పరిస్థితిని తెలుసుకున్న నైనిష ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, పిల్లల పుల్లమ్మ కి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నైనిష ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ మట్టపల్లి సాగర్ యాదవ్, జర్నలిస్ట్ పోదిల వీరబాబు, అడ్వకేట్ ఈర్ల రాము, జర్నలిస్ట్ మిట్టపల్లి గోపి, ఎండి గౌస్ పాషా, బానోతు రమేష్ , బి నాగేష్ తదితరులు పాల్గొన్నారు…









