విద్యుత్ సంస్థ జెన్కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్‌లోని ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని, విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే కాపాడాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ధర్నాను ఉద్దేశించి జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే పీఆర్సీ (PRC) వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్లందరికీ ఏపీఎస్ఈబీ (APSEB) సర్వీస్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో జాప్యం వహిస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ ప్రధాన డిమాండ్ల సాధనకై ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ఎదుట భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు స్పష్టం చేశా
రు.









