విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి: కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, పట్టుదలతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు విద్యాభ్యాసానికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థల సామాజిక సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులను స్కాలర్‌షిప్‌ల కోసం ఎంపిక చేశారు. ఎంపికైన డి.శ్వేత, డి.రేవతి, ఎన్.యశ్వంత్, పి.కీర్తి, కె.అమిత, ఏ.విజయదుర్గ అనే విద్యార్థులకు ఎస్పీ రాహుల్ మీనా చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

ఈ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మరింత శ్రద్ధతో చదువుకోవాలని, భవిష్యత్తులో సమాజానికి మేలు చేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చదువుకు ఇలాంటి సేవా సంస్థలు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు