గురుకుల విద్యార్థులకు యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగుల పంపిణీ

నకిరేకల్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి.. వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వేముల వీరేశం తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెస్ ఛార్జీలను పెంచామని, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందుతుందో లేదో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, వసతి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు