టిబెట్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాజాగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది.
ఇటీవలే టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ జలప్రళయం, విపరీతమైన వరదలు సంభవించడంతో ఇరు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ విపత్తు నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా భూకంపం సంభవించడం మరింత కలవరానికి గురిచేస్తోంది.
భూకంపం కారణంగా జరిగిన నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తాజా భూకంపం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Post Views: 31









