భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ మాడవీధులు, గోశాల, ఉత్తర ద్వారం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో బి. రాహుల్, స్థానిక సబ్ కలెక్టర్, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆలయ అధికారులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు