పంట వేశారా లేదా?” అనే దశ నుంచి “వేసిన పంట ఎంత దిగుబడి ఇస్తుంది?” అనే దశకు మారిన పరిస్థితి…!

పంట వేశారా లేదా?” అనే దశ నుంచి “వేసిన పంట ఎంత దిగుబడి ఇస్తుంది?” అనే దశకు మారిన పరిస్థితి…!

  పంట దిగుబడిపై దిగులుతో ఉన్న రైతన్న…

 

వర్షాభావం నీడలో ఖరీఫ్… విత్తనం పడింది, కాగా దిగుబడిపైనే అసలు భయం..!

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముగింపు దశకు చేరుతున్న వేళ దేశ వ్యవసాయ రంగంపై వర్షపాతం లోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వర్షాలు పడుతున్నా, ఇప్పటికే వర్షాధార పంటలు ఉన్న అనేక ప్రాంతాల్లో పంటలు వాడిపోవడం, నేలలో తేమ తగ్గడం, బోర్లు ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని Hindustan Times తాజా కథనం వెల్లడించింది.

 

 

దేశవ్యాప్తంగా 15% వర్షపాతం లోటు….

జూన్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఇండియాలో సాధారణంగా 827.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 703.7 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా 15% లోటు. సెప్టెంబర్ 22 నాటికీ దేశవ్యాప్త లోటు 15% వద్దే కొనసాగింది.

ప్రాంతాల వారీగా చూస్తే సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 21 నాటి గణాంకాల ప్రకారం దక్షిణ ద్వీపకల్పంలో 27%, తూర్పు–ఈశాన్య ఇండియాలో 26%, వాయవ్య ఇండియాలో 10% వర్షపాతం లోటు నమోదైంది. మరాఠ్వాడాలో 37%, తెలంగాణలో 21%, కోస్తాంధ్రలో 37%, కర్ణాటకలోని మూడు ప్రధాన వాతావరణ ఉపవిభాగాల్లో 28–32% వరకు లోటు ఉంది.

దేశంలో సగానికి పైగా ప్రాంతం Drought Categoryలో..

 

IIT గాంధీనగర్ Water and Climate Lab నిర్వహిస్తున్న India Drought Monitor ప్రకారం దేశ భూభాగంలో 52.5% ప్రాంతం drought categoryలో ఉండగా, 47.5% ప్రాంతం normal categoryలో ఉంది. మహారాష్ట్రలో ఏకంగా 83.5% ప్రాంతం drought-affected categoryలో ఉన్నట్లు మానిటర్ పేర్కొంది.

విత్తటం దాదాపు పూర్తయ్యింది … ఇప్పుడు అసలు సమస్య దిగుబడి…

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. వర్షపాతం దేశవ్యాప్తంగా 15% లోటులో ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంతగా తగ్గలేదు.
సెప్టెంబర్ 18 నాటికి దేశంలో 110.4 మిలియన్ హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే కేవలం 1.3% తక్కువ. వరి విస్తీర్ణం 3.7%, మొక్కజొన్న విస్తీర్ణం 2.2% తగ్గింది. అంటే సమస్య ఇప్పుడు “పంట వేశారా లేదా?” అనే దశ నుంచి “వేసిన పంట ఎంత దిగుబడి ఇస్తుంది?” అనే దశకు మారింది.

జూన్‌లో ఎండ… జూలైలో ఊరట… ఆగస్టులో మళ్లీ లోటు..

ఈ ఖరీఫ్‌లో వర్షాల సమయ పంపిణీ కూడా పంటలను ప్రభావితం చేసింది. జూన్‌లో వర్షపాతం సాధారణం కంటే సుమారు 35.4% తక్కువగా ఉండగా, జూలైలో పరిస్థితి మెరుగై సాధారణం కంటే సుమారు 1% ఎక్కువ వర్షం నమోదైంది. కానీ ఆగస్టులో మళ్లీ సుమారు 16% లోటు ఏర్పడింది. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు బలహీనంగా, అసమానంగా కొనసాగాయి.
జూలై వర్షాలు వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు కొంత ఊరటనిచ్చాయి. మరోవైపు వర్షాభావ ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న, సజ్జలు, పెసలు వంటి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలవైపు మళ్లినట్లు CRISIL విశ్లేషణను ఉటంకిస్తూ కథనం పేర్కొంది.

ఏ పంటలకు ఎక్కువ ముప్పు?

వర్షపాతం లోటు, సాగునీటి సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పత్తి, సజ్జ, మొక్కజొన్న, కంది, వేరుశనగ, సోయాబీన్ పంటలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని CRISIL గుర్తించింది. అయితే మినుము, జొన్న, సజ్జ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలు తులనాత్మకంగా మెరుగ్గా నిలబడవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలకు కొంత రక్షణ… రాబోయే రబీకి కూడా నీరే కీలకం…

 

చివరి దశ వర్షాలు ఉపయోగమే… కాగా జరిగిన నష్టాన్ని పూర్తిగా తిప్పికొట్టలేవు.. మొత్తానికి ఈ ఖరీఫ్‌లో అసలు కథ సాగు విస్తీర్ణం తగ్గడం మాత్రమే కాదు. విత్తనం దాదాపు సాధారణ స్థాయిలో పడింది… అయితే అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో వర్షం అందకపోవడంతో ఇప్పుడు అసలు ప్రశ్న — “ఎంత పంట వేశారు?” కాదు, “చేతికి ఎంత దిగుబడి వస్తుంది?” అన్నదే.ఇపుడు రైతుల కు వస్తున్న సందేహం….

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు