తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం… తెలంగాణలో నేడు 15 జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన !

తెలుగు రాష్ట్రాల్లో  వాతావరణం మారుతున్న కారణంగా … తెలంగాణలో నేడు 15 జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉన్నట్టు, అధికారులు తెలియజేస్తున్నారు !

అయితే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమన నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి రాబోయే పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాలకు వర్ష సూచనలు ఉన్నాయి.

  కరువు పరిస్థితుల్లో వర్షాలపై ఆశలు, ఎదురుచూపులు..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో వర్షాభావంతో సతమతమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాబోయే వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, భూగర్భజలాల పునరుద్ధరణకు వర్షాలు ఉపయోగపడవచ్చు అనుకుంటున్నారు .అయితే ఈశాన్య రుతుపవనాలు ఎంతవరకు ఆదుకుంటాయి? వర్షాభావాన్ని తగ్గిస్తాయా? రాబోయే పది రోజుల్లో నమోదయ్యే వర్షపాతం, దాని విస్తరణ కీలకం కానున్నాయి.

తెలంగాణలో నేడు 15 జిల్లాలకు వర్ష సూచన!

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం అక్టోబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో రాబోయే పది రోజుల పరిస్థితి

అక్టోబర్ 15–16 తేదీల్లో దక్షిణ, తూర్పు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం. అక్టోబర్ 17–19 మధ్య దక్షిణ, మధ్య, తూర్పు జిల్లాలకు వర్షాలు విస్తరించవచ్చు. అక్టోబర్ 20–24 మధ్య హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 16–19 మధ్య వర్షాలు!

కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు సంభవించవచ్చని అంచనాగా ఉంది .
హైదరాబాద్‌లో చల్లని ఉదయాలు… పగటిపూట వేడి
అక్టోబర్ 14న ఇబ్రహీంపట్నంలో 16.3°C, పటాన్‌చెరులో 17.1°C, శేరిలింగంపల్లిలో 17.2°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగర ప్రధాన ప్రాంతాల్లో 20–23°C మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా, పగటిపూట వేడి కొనసాగనుంది. అయితే రాబోయే రోజుల్లో వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు