ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. టీడీపీ రెండో జాబితా విడుదల, 22 మంది అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఒక కార్పొరేషన్‌తో పాటు 21 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు మొత్తం 22 మంది అభ్యర్థులను ప్రకటించింది.

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదాను టీడీపీ ప్రకటించింది. అలాగే ఆకివీడు నుంచి నిలోఫర్ షేక్, బేతంచెర్ల నుంచి లోకేష్ గౌడ్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి దొడ్ల విజయలక్ష్మి, చీరాల నుంచి స్పందన, డోన్ నుంచి కోట్ల సుజాతమ్మ, గుత్తి నుంచి గోవిందరాజులు, గుంతకల్లు నుంచి యశోదలను ఛైర్‌పర్సన్ అభ్యర్థులుగా ఎంపిక చేసింది.

ఇక జంగారెడ్డిగూడెం నుంచి రొంగల అనూష, కదిరి నుంచి షేక్ సమీరా, కళ్యాణదుర్గం నుంచి బుట్న లక్ష్మి, కొండపల్లి నుంచి కన్నెకంటి అమూల్య, కొవ్వూరు నుంచి జొన్నలగడ్డ రాధారాణి, నాయుడుపేట నుంచి షకీరా, నందిగామ నుంచి శాకమూరి వంశీధర్, నందికొట్కూరు నుంచి సుబురున్నిసా, నర్సీపట్నం నుంచి చింతకాయల పద్మావతి, ప్రొద్దుటూరు నుంచి నంద్యాల రాఘవరెడ్డి, వెంకటగిరి నుంచి దొంతు శారద, ఉయ్యూరు నుంచి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, ఏలేశ్వరం నుంచి యార్లగడ్డ అక్షిత, ఎమ్మిగనూరు నుంచి మాచాని సునీతలను అభ్యర్థులుగా ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు సంబంధించి 36 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు