మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ఫుల్లర్ పేటలో ఏర్పాటు చేసిన సెల్ టవర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనకు దిగారు. నివాస ప్రాంతంలో సెల్ టవర్లు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే తొలగించాలని కోరారు.
సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు వల్ల తమ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే భయంతో వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నవాబ్ మిట్ట, ఫుల్లర్ పేట ప్రాంతాలకు చెందిన స్థానికులు, మహిళలు కలిసి సెల్ టవర్ల వద్ద నిరసన తెలిపారు. తమ సమస్యలను అధికారులు గుర్తించి, టవర్ల తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Post Views: 2









