కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వివాదంలో ఛత్రపతి కాట్‌రాజ్: నటుడు సుప్రీత్‌పై క్యాబ్ డ్రైవర్ పోలీస్ కంప్లైంట్

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘ఛత్రపతి’ ఫేం సుప్రీత్ (కాట్‌రాజ్) వివాదంలో చిక్కుకున్నారు. కారు పార్కింగ్ విషయంలో తనపై అనవసరంగా దూషించి, దాడి చేశారంటూ ఒక క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుడు ఆదివారం రాత్రి కీసర పోలీస్ స్టేషన్‌లో నటుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ ముగించుకుని, మరో బుకింగ్ కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన తన కారును నిలిపాడు. అదే సమయంలో అక్కడకు కారులో వచ్చిన నటుడు సుప్రీత్.. రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ అతనిపై దాడికి దిగాడు.

డయల్ 100కు ఫోన్.. కేసు నమోదు చేసిన కీసర పోలీసులు

సుప్రీత్ దాడి చేయడంతో షాక్‌కు గురైన డ్రైవర్ శ్రీహరి వెంటనే ‘డయల్ 100’కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. వారి సూచనల మేరకు కీసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నటుడిపై ఫిర్యాదు చేశాడు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఛత్రపతి’లో విలన్ కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఢీ, రెడీ, కింగ్, నేనింతే, గజినీ, మర్యాద రామన్న, దూకుడు, సరైనోడు వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు