కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ‘పరిటాల రవి నాతో చెప్పిన ఆ మాటను సమరసింహారెడ్డి సినిమాలో డైలాగ్‌గా పెట్టాను’.. పరుచూరి

మాజీ ఎమ్మెల్యే, దివంగత పరిటాల రవితో ఉన్న పాత అనుబంధాన్ని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. పరిటాల రవి తన తండ్రి జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘శ్రీరాములయ్య’ సినిమాకు పరుచూరి బ్రదర్స్ (వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ) కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చర్చల సమయంలో పరిటాల రవి చెప్పిన ఒక ఆసక్తికరమైన మాట తనకు బాగా నచ్చి, నందమూరి బాలకృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ‘సమరసింహారెడ్డి’లో ఒక కీలకమైన సన్నివేశంగా, డైలాగ్‌గా మార్చినట్లు పరుచూరి వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ‘శ్రీరాములయ్య’ సినిమా స్క్రిప్ట్ చర్చల సమయంలో పరుచూరి గోపాలకృష్ణ పరిటాల రవికి ప్రసాదం ఇవ్వగా, ఆయన దానిని తినబోతూ ఒక్క నిమిషం ఆగి ‘ఎవరిచ్చారు అన్నా ఇది?’ అని ప్రశ్నించారు. దానికి పరుచూరి స్పందిస్తూ.. ‘మా రెండో అన్నయ్య (పరుచూరి వెంకటేశ్వరరావు) పంపించారు’ అని చెప్పడంతో రవి ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంతగా ఎందుకు అనుమానించారని పరుచూరి ప్రశ్నించగా.. “అది కాదన్నా, నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తింటానని నా శత్రువులకు తెలుసు. అందుకే నిన్ను వాడుకుని నీ చేతి ద్వారా నాకు విషం అందేలా వారు కుట్ర చేసే అవకాశం ఉంది, అందుకే అడిగాను” అని రవి సమాధానమిచ్చారు. శత్రువులు ఏ రూపంలోనైనా రావచ్చు అనే ఈ పాయింట్ పరుచూరికి బాగా నచ్చింది. దాంతో ‘సమరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ పాత్రపై శత్రువులు కుట్ర చేస్తారేమోనని, ఆయన ఏది తిన్నా ముందుగా నటుడు పృథ్వీ రుచి చూసి, ఆ తర్వాతే బాలయ్యకు ఇచ్చేలా సీన్ రాశానని పరుచూరి వివరించారు.

రామానాయుడు స్టూడియో బాంబ్ బ్లాస్ట్ ఘటనపై పరుచూరి స్పందన

ఈ సందర్భంగా 1997లో జరిగిన ఘోరమైన కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనను కూడా పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. “హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రామానాయుడు స్టూడియోలో ‘శ్రీరాములయ్య’ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రోజున ఆ బాంబు పేలుడు జరిగింది. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక ఎర్ర శాలువా పడి ఉండటంతో, అది నాదే అనుకుని నేను చనిపోయానని అందరూ భావించారు. ఈ వార్త తెలిసి నా కుమార్తె ఇంట్లో స్పృహతప్పి పడిపోయింది. ఆ వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు” అని చెప్పారు. ఆ ప్రమాదం తర్వాత ‘భయమేస్తుందా అన్నా?’ అని పరిటాల రవి అడగ్గా.. ‘నువ్వు పక్కన ఉంటే నాకు ఎలాంటి భయం లేదు’ అని తాను ధైర్యంగా చెప్పినట్లు పరుచూరి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు