12 షార్ట్‌ ఫిల్మ్స్‌.. 82 ఏళ్ల అమితాబ్‌ స్పీడ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు. 82 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ఒకే రోజులో ఏకంగా 12 షార్ట్‌ ఫిల్మ్స్‌ షూటింగ్‌తో పాటు, రెండు స్టిల్‌ ఫొటోషూట్లను కూడా విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తన అభిమానులను ‘ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీ’గా పిలిచే బిగ్‌బీ.. పని పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. “పని అంటే పనే.. ఈ రోజు 12 షార్ట్‌ ఫిల్మ్స్‌, రెండు స్టిల్‌ షూట్లు పూర్తి చేశాను, అయినా మీతో కనెక్ట్ అవ్వడం ఆగకూడదు” అంటూ పోస్ట్ చేశారు. క్రమశిక్షణతో, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన చూపిస్తున్న ఈ జోష్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇటీవల రజినీకాంత్‌తో కలిసి ఆయన నటించిన ‘వెట్టాయన్‌’ చిత్రం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు