తల్లి కాబోతున్న సమంత ?.. నెట్టింట బేబీ బంప్ ఫొటోలు వైరల్!

కథానాయిక సమంత అభిమానులకు త్వరలోనే ఒక తియ్యటి కబురు చెప్పబోతున్నారా? రీసెంట్‌గా తాను స్వయంగా నిర్మించి, నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా సమంత తల్లికాబోతున్నారనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో ఆమె ‘బేబీ బంప్’తో కనిపించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాల వద్ద ప్రస్తావించగా, సమంత గర్భవతి అనే వార్త నిజమేనని సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అటు సామ్ కానీ, ఇటు ఆమె భర్త రాజ్ కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

సమంత, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు గతేడాది వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ప్రసిద్ధ ఈశా యోగా కేంద్రంలో అత్యంత పవిత్రమైన ‘భూతశుద్ధి’ వివాహ విధానంలో వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, అలాగే ‘సిటడెల్: హనీ బన్నీ’ కోసం కలిసి పనిచేస్తున్న సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఇటు పర్సనల్ లైఫ్‌లో సమంత వరుస సంతోషాలతో మునిగితేలుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు