ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు..? ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్)పై ఏపీలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. బెయిల్ పై అతడు బయటకు వస్తున్నప్పటికీ… ఇప్పటికే నమోదైన ఇతర కేసుల్లో మళ్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ ఆయన విమర్శనాత్మకంగా ట్వీట్ చేశారు.

 

 

“అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. మళ్లీ అరెస్ట్. మీరు తప్పు చేస్తున్నారని మీకు కోర్టులు స్పష్టంగా చెప్పడం లేదా? మీ కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు” అంటూ ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. “ప్రశ్నించే వారిని అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేయడం ఎంతవరకు సాగుతుంది? కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మరో కేసు తెరిచి వేధించడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.

 

రావణ్ ఏలూరులో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, వెంటనే సర్పవరం పోలీసులు మరో పాత కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రావణ్‌పై మొత్తం 30 కేసులు ఉన్నాయని, ఇది స్పష్టమైన ప్రతీకార చర్య అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. జనసేన కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న ఘటనను కూడా ఆయన ప్రస్తావిస్తూ… ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు