మణుగూరు కి మధ్యలో ఉన్న వాగుల్లో పేరుకుపోయిన చెత్త,చెదారం తొలిగించేది ఎవరు..? వర్షాలు వస్తె పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నిస్తున్న పట్టణవాసులు…
Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
వర్షాకాలం ఆరంభం కాగానే గత కొద్ది సంవత్సరాలుగా వాగులు తెగి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమమౌతున్నాయి. ఇందుకు కారణం మణుగూరు పట్టణం లో ఉన్న వాగులు , చెరువుల్లో చెత్త, చెదారం తో నిండిపోవటం మూలంగా ఇటువంటి పరిస్థితి నెలకొంటుందని పట్టణవాసులు ఆరోపణ చేస్తున్నారు.
వాగుల శుభ్రత కొరకు, వాగులను వెడల్పు చేసేందుకు నిధులు ఖర్చు పెట్టారని,.కాగా అరకొర పనులు చేపట్టటం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని ప్రతి పక్షాల నుండి విమర్శలు వినవస్తున్నాయి. వాగుల్లో, చెరువుల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవడం వల్ల కొద్దిపాటి వర్షాలకే అవి నిండిపోయి నీరు బయటికి వస్తుందని, ఇప్పటికైనా వాగుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించవలసిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు









