వైటీపీఎస్ సీఈ సురేష్ సస్పెన్షన్‌పై ఇంజనీర్ల సంఘాల ఆగ్రహం.. వివక్ష వీడాలని డిమాండ్.

వైటీపీఎస్ సీఈ సురేష్ సస్పెన్షన్‌పై ఇంజనీర్ల సంఘాల ఆగ్రహం.. వివక్ష వీడాలని డిమాండ్.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) స్టేజ్‌-1 చీఫ్ ఇంజనీర్ సురేష్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయడంపై విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.అవసరమైనంత బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే ఉత్పత్తిలో అంతరాయాలు ఏర్పడుతుంటే, అందుకు క్షేత్రస్థాయి అధికారులను ఏ విధంగా బాధ్యులను చేస్తారని వారు నిలదీశారు.
విద్యుదుత్పత్తి లోపాల వైఫల్యానికి ప్రభుత్వంతో పాటు సంస్థ యాజమాన్యమే పూర్తి జవాబుదారీతనం వహించాలని సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. స్టేజ్‌-2 సీఈ సూర్యనారాయణ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, టీపీసీ సీఈ పీవీ శ్రీనివాసరావులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మినహాయించడం వెనుక ఆంధ్రా అధికారులకు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ధ్వజమెత్తారు.
కీలకమైన విద్యుత్ హోదాల్లో ఇంకా కొనసాగుతున్న ఆంధ్ర ప్రాంత ఇంజనీర్లను తక్షణమే రిలీవ్ చేసి బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు