కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం వేగం పెంచింది. తాజాగా ఈ మూవీ నుండి రెండో పాట ‘మనసు ఆగదే’ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘తబాహి’తోనే సినిమాపై బోల్డ్ రొమాంటిక్ టోన్‌ను సెట్ చేసిన చిత్రబృందం, ఇప్పుడు ఈ రెండో సింగిల్‌తో అంతకుమించిన లవ్ కెమిస్ట్రీని ఆవిష్కరించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌లో రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా మధ్య పండిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాత్‌టబ్‌లో తారా సుతారియా గ్లామరస్ ఎంట్రీ ఇవ్వడం, ఆమెకు యశ్ గన్‌తో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే వైవిధ్యమైన సీన్, వర్షంలో సాగే వీరి రొమాంటిక్ మూమెంట్స్‌తో పాటు కేఫే నేపథ్యంలో వచ్చిన ముద్దుల సన్నివేశాలు ఈ పాటకు ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. దాంతో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సౌత్, నార్త్ సినీ పరిశ్రమలకు చెందిన టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి లాంటి భారీ తారాగణం ఈ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ కథలో సందడి చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ మిశ్రా, కనిష్క్ బాగ్చీ అద్భుతమైన స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఈ రెండో పాట కూడా చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో, రాబోయే ‘టాక్సిక్’ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.









