తాలిపేరుకు వరద ఉధృతి.. 22 గేట్లు ఎత్తివేత…
జులై 29 TODAY 9
చర్ల,మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు నీరు భారీగా పోటెత్తుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు నీటిమట్టం దాదాపు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో 22 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 73.39 మీటర్లకు చేరుకుంది.
ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని, ముఖ్యంగా వాగులు, వంకలు, నదులను దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.









