స్టార్ హీరో సూర్య తన ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’ విడుదల సమయంలో ఎదురైన తీవ్ర ఆర్థిక ఇబ్బందులను, ఆ క్లిష్ట సమయంలో తన భార్య జ్యోతిక అందించిన అపారమైన మద్దతును తాజాగా వెల్లడించారు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిత్రం విడుదల రోజున ఎదురైన ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించేందుకు చివరి నిమిషంలో అదనపు రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, కుటుంబంగా కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ జ్యోతిక తన నిర్ణయాన్ని సంపూర్ణంగా నమ్మిందని తెలిపారు.
ఈ సందర్భంగా జ్యోతిక స్పందిస్తూ.. ఈ విజయంలో తన పాత్ర ఏమీ లేదని, సినిమాను ఎలాగైనా ప్రేక్షకులకు అందించాలనే సూర్య నిబద్ధత మరియు ఔదార్యమే అసలు కారణమని పేర్కొన్నారు. కాగా, ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబంగా ఒకే వైపు నిలబడటం తమ అలవాటని ఆమె తెలిపారు. ఈ సినిమా విజయం వెనుక దర్శకుడు ఆర్జే బాలాజీతో పాటు ఫైనాన్షియర్ల కృషి ఎంతో ఉందని సూర్య కొనియాడారు.









