పేరు మార్చుకున్న చిన్న దేశం నౌరు: కొత్త పేరు ‘రిపబ్లిక్ ఆఫ్ నౌఇరో’

ప్రపంచంలోనే అత్యంత చిన్న ద్వీప దేశాల్లో ఒకటైన ‘నౌరు’ తన పేరును అధికారికంగా ‘రిపబ్లిక్ ఆఫ్ నౌఇరో’ (Republic of Naoero) గా మార్చుకుంటూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పు ద్వారా తమ దేశ అసలైన ప్రాచీన జాతీయ గుర్తింపును, సాంస్కృతిక మూలాలను తిరిగి పొందినట్లు ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ అడియాంగ్ వెల్లడించారు. పూర్వం విదేశీ వలస పాలకుల పాలనలో ఉన్న కాలంలో మార్చబడిన అసలు పేరు ‘నౌఇరో’ను తిరిగి పునరుద్ధరించారు.

గతంలో జర్మనీ, బ్రిటన్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల పరిపాలనలో నలిగిన ఈ ద్వీపం, సుదీర్ఘ పోరాటం అనంతరం 1968లో పూర్తి స్వాతంత్య్రాన్ని సాధించింది. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే మూడో అత్యంత చిన్న దేశమైన నౌఇరోలో కేవలం 12,000 మంది జనాభా మాత్రమే ఉన్నారు.

ఈ ద్వీప దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఫాస్ఫేట్ మైనింగ్, సముద్ర ఆధారిత చేపల వేటపై ఆధారపడి ఉంది. వీటితో పాటు ఆస్ట్రేలియా అందించే ఆర్థిక సహాయం మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా దేశం తన అవసరాలను సమకూర్చుకుంటోంది. ప్రస్తుత పేరు మార్పు నిర్ణయంతో ఈ దేశం అంతర్జాతీయ వేదికపై మరోసారి వార్తల్లో నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు