చైనా ‘షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్’పై అమెరికా సంచలన ఆరోపణలు.. భారత్‌ సహా 40 దేశాల పేర్లు

అమెరికా విధించే భారీ టారిఫ్‌లను తప్పించుకునేందుకు చైనా తన ఉత్పత్తులను నేరుగా అమెరికాకు పంపకుండా ఇతర దేశాల మీదుగా రూట్ మార్చి తరలిస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని “షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్ నెట్‌వర్క్”గా పేర్కొంటూ, భారత్‌ సహా 40కి పైగా దేశాలు ఈ నెట్‌వర్క్‌లో భాగమయ్యాయని అమెరికా తాజా నివేదికలో పేర్కొంది.

ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో “ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్” పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ ఆరోపణలు చేశారు. 2018లో ట్రంప్ ప్రభుత్వం చైనీస్ వస్తువులపై సెక్షన్ 301 కింద భారీ టారిఫ్‌లు విధించిన తర్వాత, చైనా ఉత్పత్తులను ఇతర దేశాల మీదుగా అమెరికాకు పంపించే విధానం మరింత పెరిగిందని నవారో పేర్కొన్నారు.

ఈ రూట్ మార్పుల ద్వారా జరుగుతున్న అక్రమ లేదా టారిఫ్‌ తప్పించుకునే వాణిజ్య విలువ ఏటా సుమారు 40 బిలియన్‌ డాలర్ల నుంచి 303 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. అమెరికా చేసిన ఈ ఆరోపణలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత దేశాల అధికారిక స్పందనలు, నివేదికలో పేర్కొన్న వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు