భద్రాద్రి టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన పొదెం వీరయ్య..

భద్రాద్రి టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన పొదెం వీరయ్య..

 

భద్రాచలం.. ఆగస్ట్ 15 : D వినేష్

 

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, భద్రాచలం పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలోని భద్రాద్రి టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ వారు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , ఏఐసీసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు పొదెం వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా  పొదెం వీరయ్య దేశ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమం లో భద్రాద్రి టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అంకాళ జగన్, రామకృష్ణ, అశోక్, కరుణాకర్, అనిల్,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడబాల వెంకటేశ్వరరావు, తమ్మల్ల వెంకటేశ్వరరావు, కొలపూడి వరుణ్, కాపుల శ్రీను, కొండా సతీష్, ముత్యాల సాయి భార్గవ్, సెల్ శెట్టి జయమ్మ, మహిళా కాంగ్రెస్ పందాల సరిత, పద్మాప్రియ, సతీష్, నరేష్, అనిల్, కిరణ్ కుమార్, లక్ష్మయ్య, మున్నా,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు