ఢిల్లీని చెత్త రహిత నగరంగా మార్చేందుకు వినూత్న పథకం: క్లీనెస్ట్ వార్డుకు ప్రతినెలా రూ.కోటి నజరానా

దేశ రాజధాని ఢిల్లీని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేఖా గుప్తా ‘ఢిల్లీ కో కూడే సే ఆజాదీ – స్వచ్ఛతా అభియాన్ 2026’ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలో ప్రతి నెలా అత్యంత పరిశుభ్రంగా నిలిచే మున్సిపల్ వార్డుకు ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల (CMDF) నుంచి నెలకు రూ.కోటి చొప్పున, ఏడాదికి గరిష్టంగా రూ.12 కోట్ల వరకు అదనపు అభివృద్ధి నిధులను ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పోటీలో పారదర్శకతను కాపాడేందుకు కఠిన నిబంధనలను విధించారు. స్వతంత్ర సంస్థల నివేదికలు, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలతో పాటు పౌరుల నుంచి సోషల్ మీడియా ద్వారా వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఏ వార్డు పరిధిలోనైనా చెత్త పేరుకుపోయినట్లు స్థానికుల నుంచి చిన్న నిజమైన ఫిర్యాదు వచ్చినా, ఆ వార్డును తక్షణమే ఆ నెలకు సంబంధించిన పోటీ రేసు నుంచి తప్పిస్తారు.

నగరంలో ల్యాండ్‌ఫిల్ కుప్పల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం “4 Cs” (కలెక్షన్, క్లీనింగ్, కన్వర్షన్, సర్క్యులర్ ఎకానమీ) విధానాన్ని అమలు చేస్తోంది. దీనికోసం 70 మెకానికల్ స్వీపింగ్ మిషన్లు, 125 వ్యర్థాల సేకరణ కేంద్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు మురికివాడలు, పబ్లిక్ టాయిలెట్లు, పార్కుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ‘మేరా స్కూల్, సబ్సే సుందర్’ పోటీలను చేపడుతూ, ప్రతి సోమవారం ప్రగతి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు