అర్థరాత్రి మారెళ్ళపాడు పనులను ఆకస్మిక తనిఖీ చేసిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు… వంట గ్యాస్ కొరత రాకుండా భారత్ ముందస్తు చర్యలు: ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు కేంద్రం ఆదేశం ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత: సౌదీ సైనిక నౌక, ఆయుధ డిపోపై హౌతీ రెబల్స్ క్షిపణి, డ్రోన్ దాడులు టీనేజ్ ప్రెగ్నెన్సీలో దేశంలోనే బెంగాల్ టాప్: ఆందోళన వ్యక్తం చేసిన ఆరోగ్య మంత్రి శరద్వత్ ముఖర్జీ సదాశివపేటలో మండల స్థాయి ‘ప్రజావాణి’ ప్రారంభం: సమస్యల పరిష్కారానికి అధికారుల చొరవ చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర హెచ్చరిక

  చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర హెచ్చరిక

వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల గోపాల్‌పేటలో జరిగిన పార్టీ సమావేశంలో తనపై చిన్నారెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి చిన్నారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని మేఘారెడ్డి మండిపడ్డారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చిన్నారెడ్డికి టికెట్ ఎలా దక్కిందో, ఏడుసార్లు పోటీ చేసేందుకు ఎవరికి డబ్బులు ఇచ్చారో చెప్పాలంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులకు పనులు చేసి పెట్టాలని చిన్నారెడ్డి ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై పూర్తి ఆధారాలతో ఏఐసీసీ, పీసీసీ, క్రమశిక్షణ సంఘంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డిపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకునేంత వరకు తన పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు