వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.5 వేల జరిమానా

వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు VI అదనపు జిల్లా జడ్జి శ్రీమతి టి. హరిత సోమవారం తీర్పు వెలువరించారు. 2017లో గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

కేసు వివరాల ప్రకారం.. బి.గుణవతి అలియాస్ కోమతి (21) అనే వివాహిత మహిళను అదనపు వరకట్నం కోసం వేధించి హత్య చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు బి.ఉమాపతి, అతని తల్లి మునెమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 28/2017గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో IPC సెక్షన్లు 498-A, 304-Bతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు