బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ పండుగ ప్రకటన చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంలో పితృస్వామ్య వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు.
“పితృస్వామ్యాన్ని కూల్చివేయండి” అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తనదైన శైలిలో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీజేపీ అధికారిక పోస్ట్‌ను రీషేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో కృతి సనన్ యాడ్ చుట్టూ మొదలైన చర్చ రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు కృతి సనన్ యాడ్‌లో ఆమె ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడం వంటి అంశాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు, తాజాగా రాహుల్ గాంధీ చేసిన పితృస్వామ్య వ్యాఖ్యలతో ఈ అంశం మరింత రాజకీయ చర్చకు దారితీసింది.









