ప్రొహిభిషన్ & ఎక్సైజ్ SHO Sk. రహీమున్నీసా బేగంపై సస్పెన్షన్ వేటు…

ప్రొహిభిషన్ & ఎక్సైజ్ SHO Sk. రహీమున్నీసా బేగంపై సస్పెన్షన్ వేటు…

ఎండు గంజాయి కేసులో నిండితుడు తప్పించుకున్న ఘటనలో…. సస్పెన్షన్..

భద్రాచలం  : ఆగస్ట్ 26 : D వినేష్….

భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిణి రహీమున్నీసా బేగంపై ఆ శాఖ ఉన్నతాధికారులు  సస్పెన్షన్ వేటు వేశారు. ఈనెల 4వ తేదీన ఎండు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు ఇద్దరిలో ఒక్కరు 5 వ తేదీ న ఎక్సైజ్ అధికారుల కళ్ళుగప్పి  తప్పించుకున్నారు . ఆ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను  ఆమెపై అధికారులు చర్యలు తీసుకున్నారు వివరాల్లోకి వెళితే…

ఈనెల 5వ తేదీ నాడు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులపై పొజిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ SHO భద్రాచలం ద్వారా COR నం. 241/2026 కేసు నమోదు చేయగా పట్టుబడ్డ – ఇద్దరు నిందితులలో ఒకరు SHO భద్రాచలం అదుపులో నుండి తప్పించుకున్నారు – SHO Sk. రహీమున్నీసా బేగం, P&EC Ch. రవి కుమార్ (భద్రాచలం స్టేషన్)లు విధుల పట్ల నిర్లక్ష్యం వహించారన్న కారణంతోప్రొహిభిషన్ & ఎక్సైజ్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ జిల్లా ఎక్సైజ్ అధికారి (వరంగల్-అర్బన్ / CD-4 నోడల్ DPEO)ల దృష్టిని రావటం తో సస్పెన్షన్ వేటు పడింది…

ఈ నెల 05 తేదీ భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ అదుపులో ఉన్న COR నం. 241/2026 కేసు లో A1 నిందితుడు మాధబ హంతల్ (తండ్రి: చైతన్ హంత) తప్పించుకున్న ఘటనపై ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందించారు . అలాగే, భద్రాచలం SHO Sk. రహీమున్నీసా బేగం పంచనామా ఇతర కేసు రికార్డులను తారుమారు చేయడం (ఫోర్జరీ)ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారన్న ఆరోపణలు అధికారులు పరిగణలోకి తీసుకున్నారు .

ఆరోపణల పై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో, విధులపట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపినందుకు ఇద్దరు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేస్తూ , శాఖాపరమైన సమగ్ర విచారణను చేపట్టనున్నట్టు ఎక్సయిజ్ శాఖ అధికారులు తెలియజేశారు..

గతంలోనూ ఎన్నో ఆరోపణలు..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మద్యం మాఫియా విస్తరిస్తూ,ఆ దిశగా దేవాలయ ప్రాంతం స్కూల్లు ఉన్న ప్రదేశాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుపుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తినా ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని, మీడియాలో వార్త కథనాలు వెలువడ్డా బేఖాతరు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులే వారికి సహకరిస్తున్నారంటూ, ప్రజలు తీవ్ర ఆగ్రహా వేశాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే…. ఇలాంటి అధికారులు ఉంటే ఏ శాఖ కైనా  చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన  భద్రాచలం ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ స్టేషన్ కు ఇప్పటికైనా మంచి నిబద్ధత నిజాయితీ అంకిత భావం కలిగిన అధికారిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు