స్నేహితుడి పెళ్లికి షాకింగ్ గిఫ్ట్.. ఛాతిపై కొత్త జంట టాటూ!

పెళ్లి వేడుకల్లో స్నేహితులు, బంధువులు కొత్త జంటకు తమకు తోచిన బహుమతులు ఇస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన స్నేహితుడి పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్నేహితుడితో పాటు అతడి కొత్త భార్య చిత్రాన్ని తన ఛాతిపై శాశ్వత టాటూగా వేయించుకుని పెళ్లి వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో భాగంగా సదరు వ్యక్తి కొత్త జంటకు ఓ స్కెచ్‌ను బహుమతిగా అందించాడు. అందులో వరుడు, వధువు ఇద్దరి చిత్రాలు ఉన్నాయి. అయితే ఆ స్కెచ్ ఇచ్చిన తర్వాత అతడు చేసిన పని చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఒక్కసారిగా షర్ట్ విప్పి తన ఛాతిని చూపించగా, అదే కొత్త జంట చిత్రాన్ని తన ఛాతిపై శాశ్వత టాటూగా వేయించుకున్న విషయం కనిపించింది. దీంతో పెళ్లి కొడుకుతో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

అతడి ఈ విచిత్రమైన గిఫ్ట్ చూసిన వరుడి ముఖంలో ఆశ్చర్యం, అయోమయం కలగలిసిన భావాలు స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం ఈ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు స్నేహితుడి పట్ల అతడి అభిమానం అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటి గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిదంటూ స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share