Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరులో ఇష్టానుసారంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, గ్యాంగులుగా ఏర్పడి, ఎవరైనా అడ్డు వస్తే గొడవలపడి దాడులకు దిగుతున్నారు. దీనికి నిదర్శనమే ఈ ఘటన. ఈ గ్యాంగ్ వార్ లో శివ (28)అనే యువకుడు మృత్యువాత పడ్డాడు.
మృతుడు రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు ఉదయమే శివ కుమార్ మణుగూరు రావడం జరిగింది..మృతుని తండ్రి వీరభద్రా చారి కార్పెంటర్, శివకుమార్ కూడా హైదరాబాదులో ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.. శివ వద్ద పనిచేసే వర్కర్ కి మరియు ఎంకే గ్యాంగ్ కి మధ్య వివాదం …ఆ వివాదంలో శివను గ్రౌండ్కి పిలిపించి దాడి చేసిన ఎంకే గ్యాంగ్….
ఈ సంఘటనతో మణుగూరులో విషాదఛాయలు అలముకున్నాయి ఎంతో సంతోషంతో తోబుట్టువుల చేత రాఖీ కట్టించుకోవడానికి ఇంటికి వచ్చిన కుమారుడు ఇలా మృత్యువాత పడడం జీర్ణించుకోలేక తల్లి సుహతప్పి ఆసుపత్రి పాలు అవడం ఆ కుటుంబాన్ని ఎంతో ఆవేదనకు గురవడంతో…..
ఇకపై పోలీసులు ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని రోడ్లమీద బైక్ స్టంట్ లు వేసే, ముగ్గురు ముగ్గురు తిరిగి ప్రజలు ఇబ్బంది పెట్టే, అవసరం లేకపోయినా గ్యాంగులుగా తయారై రాత్రివేళ తిరుగుతున్న, పోలీసులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదమే.









