సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

జీవీ నారాయణ రావు మరణవార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయనను స్నేహశీలి, ఆప్యాయంగా పలకరించే మంచి మనిషిగా గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

చిరంజీవి బాల్య మిత్రుడిగా కూడా జీవీ నారాయణ రావుకు మంచి అనుబంధం ఉందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. ‘‘మరొక హీరో మన భువి తారాలోకం వీడి గగన మార్గం గుండా ఆ శివుని చేరుకున్నారు. అజాతశత్రువు, అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి మనల్ని వీడటం బాధాకరం’’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share