భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని గెలిచిన తొలి భారతీయ చెస్ క్రీడాకారుడిగా అరుదైన ఘనత సాధించారు.
ఫైనల్లో అమెరికా స్టార్ ఫాబియానో కరువానాను 15-13 తేడాతో ఓడించారు. ఓ దశలో ఆరు పాయింట్లు వెనుకబడిన ప్రజ్ఞానంద.. వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్స్‌లో గెలిచి అద్భుతంగా పుంజుకున్నారు.
ఆ తర్వాత బ్లిట్జ్ గేమ్స్‌లోనూ ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఒత్తిడిని అధిగమించి సాధించిన ఈ విజయం ప్రజ్ఞానంద కెరీర్‌లోనే కీలక మైలురాయిగా నిలిచింది.
Post Views: 1









