ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించారు. Forbes India 2026 ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై ఆయనకు చోటు దక్కింది. ‘పుష్ప 2: ది రూల్’ విజయంతో దేశవ్యాప్తంగా పెరిగిన ఆయన క్రేజ్‌కు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.

సినిమాలతో పాటు అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్, మేనరిజమ్స్‌కు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో ప్రముఖ బ్రాండ్లు సైతం ఆయనతో ప్రచారాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బాక్సాఫీస్ ప్రభావంతో పాటు బలమైన బ్రాండ్ విలువను ఆయన సొంతం చేసుకున్నారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.

తెలుగు స్టార్‌గా ప్రారంభమైన బన్నీ ప్రయాణం ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఇప్పుడు జాతీయ సెలబ్రిటీగా ఆయన ప్రభావం మరింత విస్తరించడంతో.. ‘బ్రాండ్ AA’ ఎదుగుదలకు ఫోర్బ్స్ ఇండియా కవర్ మరో నిదర్శనమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share