రియల్‌మీ C సిరీస్‌లో కొత్తగా C100i 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.8 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6500mAh బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో బడ్జెట్ విభాగంలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 700 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్, HBMలో 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. పాండా@MN228 గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. పనితీరు కోసం UNISOC T7250 ప్రాసెసర్, 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్ ఇచ్చారు.
వర్చువల్ RAMతో మెమొరీని 12GB వరకు పెంచుకోవచ్చు. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 6.0పై పనిచేసే ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, ప్రత్యేక మైక్రోSD స్లాట్ కూడా ఉన్నాయి.









